తెలంగాణలో కొవిషీల్డ్ టీకా పంపిణీ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు లేనట్టే. తగినంత నిల్వలు లేనందున కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా కేటాయింపులు ఉంటేనే కొవాగ్జిన్ రెండో డోసు పంపిణీ కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం కొవిషీల్డ్ టీకా మొదటి, రెండో డోసు మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచింది. దీంతో ఈ నెలలో రెండో డోసు తీసుకోవాల్సినవారు ఉండకపోవచ్చన్న భావనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వచ్చింది. ఇక మే నెలలో కొవాగ్జిన్ రెండో డోసు తీసుకోవాల్సినవారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. అయితే, వీరందరికీ వేయడానికి సరిపడా టీకాలు లేవు. ప్రస్తుతం 50 వేల డోసులే ఉన్నాయి. వీటితో కనీసం ఒక్కరోజు కూడా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేంద్రం నుంచి మరిన్ని డోసులు వచ్చాకే వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Related Articles
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
- February 10, 2024
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం
- December 7, 2023
రేవంత్ రాజకీయ ప్రస్థానం
- December 5, 2023
రేవంత్ రెడ్డి ట్రెండింగ్
- December 5, 2023
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- December 5, 2023
తెలంగాణ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ..
- February 28, 2023
TS: నేడు వైద్య కళాశాలల బంద్
- February 27, 2023