వ్యాక్సిన్‌ మేలా…హైటెక్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌

మోడీ మార్క్‌ బిజినెస్‌
ఒకే చోట… ఒకే రోజు
40,000 మందికి వ్యాక్సిన్‌
వ్యాక్సిన్‌ ధర రూ. 1,400

పేదవాడికి నో వ్యాక్సిన్‌. డబ్బుంటే ఇదిగో ఇలా వెళ్ళి.. అలా వేసుకుని వచ్చేయొచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40వేల వ్యాక్సిన్లు ఒకే రోజు. ఒకే చోట. సుమారుపాటి రాష్ట్రంలో ఒకే రోజు ప్రభుత్వాలు కూడా ఈ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం లేదు. మూడు రోజుల కింద ఇలాంటి వ్యాక్సిన్‌ డ్రైవ్‌ జరిగింది ఇక్కడే. మళ్ళీ ఇవాళ. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన వ్యాక్సిన్‌ను ఇపుడు ‘వ్యాక్సిన్‌ మేలా’ పెట్టి అమ్ముతున్నాయి ప్రైవేట్‌ కంపెనీలు. నీళ్ళ బాటిల్‌ కంటే తక్కువ ధరకు ఇస్తానన్న వ్యాక్సిన్‌ ఇస్తానన్న భారత్‌ బయోటెక్‌కు… మోడీ పుణ్యమా అని ప్రైవేట్‌వారికి అమ్మే ఛాన్స్‌ దొరికింది. కోవాగ్జిన్‌ టీకాను మెడికవర్ అనే హాస్పిటల్‌ రూ. 1,400లకు వేస్తోంది. హైటెక్స్‌లో జరగుతున్న ఈ వ్యాక్సిన్‌ మేలా కోసం జనం వేల సంఖ్యలో బయలు దేరడంతో హైటెక్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఎవడు ఎక్కడికి పోతే మనకేం… మన ప్రాణాలు దక్కితే చాలు. ఇది జనం ఆలోచన.దీన్నే మోడీ, వ్యాక్సిన్‌ కంపెనీలు, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ క్యాష్‌ చేసుకుంటున్నాయి.

Related Articles