ఇక్కడ డబ్బు… అక్కడ కులం

వ్యాక్సినేషన్‌కు ఇదీ అర్హత
మోడీ రాజ్యంలో కొత్త నమూనా
బతికే హక్కుకు ప్రమాణాలు?
ప్రైవేటీకరణ వెర్రితలలు
జాతీయ స్థాయిలో గుజరాత్‌ మోడల్‌

ఇవాళ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 40,000 మంది వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు వ్యాక్సిన్‌ దొరకదు కాని.. ఇక్కడ రూ. 1,400 కడితే వ్యాక్సిన్‌ లభిస్తోంది. 3 హ్యాంగర్స్‌లో .. ఒక్కోదానిలో 100 వ్యాక్సినేషన్లు కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 300 కౌంటర్లలో వ్యాక్సిన్‌ వేస్తున్నారన్నమాట. ఈ కార్యక్రమానికి సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కూడా సాయం అందించారు. మెడికవర్‌ హాస్పిటల్‌ ఈ వ్యాక్సినేషన్‌ వేసింది. అయితే ఇక్కడ మీరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటే ఒక్కో డోస్‌కు రూ. 1,400 కట్టాలి. నీళ్ళ బాటిల్‌ కన్నా తక్కువ ధరకు ఇస్తామన్న కోవాగ్జిన్‌ను ఇక్కడ వేస్తున్నారు. మోడీ నేతృత్వంలో వ్యాక్సిన్ల ప్రైవేటీకరణ ఇలా సాగుతోంది.
బెంగళూరు రూటే వేరు…
డాక్టర్‌ అనింద్యా కర్‌ ఇవాళ కొన్ని ఫోటోలను ట్వీట్‌ చేశారు. ఇది కూడా సామూహిక వ్యాక్సినేషన్‌కు సంబంధించిందే. దళితులు వ్యాక్సిన్‌ కోసం వెళితే పొమ్మన్నారట. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కేవలం బ్రాహ్మణులకేనని వెనక్కి పంపించి వేశారట. ఉచిత వ్యాక్సిన్‌ పొందడం ప్రజల రాజ్యాంగ హక్కు. చివరికి మోడీ ప్రభుత్వంలో ఇది కులాలవారీగా ఇచ్చే దౌర్భాగ్యం పరిస్థితి నెలకొనడం విచారకం.

Related Articles