సైబరాబాద్‌లోని కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూమిని ఈనెల రేపు వేలం వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వేలం ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరుతూ భాజపా నేత విజయశాంతి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసులో పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
Related Articles
‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్
- December 6, 2023
మహిళ కిడ్నాప్.. గ్యాంగ్ రేప్
- February 20, 2023
హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతికకాయం
- February 19, 2023
Hyderabad: నేడు రాత్రి 10 తర్వాత ఫ్లై ఓవర్లు మూసివేత
- February 18, 2023
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
- February 14, 2023
రేపు సీఎల్పీ అత్యవసర భేటీ
- January 8, 2022