ఆ అటవిక చట్టం ఇంకా అవసరమా?

దేశ ద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ద్రోహం చట్టమనేది ఓ ఓ చెట్టును కోయడానికి ఓ కార్పెంటర్‌కు ఇచ్చిన రంపంలాంటిదని, చెట్టుకు బదులు ఏకంగా అడవినే కోసేందుకు ఆ రంపాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది బ్రిటీషర్లు తెచ్చిన తెచ్చిన చట్టం. స్వాతంత్ర్య పోరాటాన్ని అణిచివేసేందుకు దీన్ని ఉపయోగించారు. మహాత్మా గాంధీపై ఉపయోగించారు. తిలక్‌పై వాడారు. 75 ఏళ్ళ తరవాత కూడా ఈ చట్టం అవసరమా అని ఆయన అటార్ని జనరల్‌ కెకె వేణుగోపాల్‌ను ప్రశ్నించారు.

దేశద్రోహం చట్టాన్ని తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నారు. పేకాట ఆడేవారిపైనే ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని.. బెయిల్‌ రాకుండా కక్ష సాధింపు కోసం దీన్ని వాడుతున్నారని… అధికార దాహంతో బెదిరించేందుకు కూడా ఈ చట్టాన్ని వాడుతున్న విషయాన్ని ఆయన ఏజీ దృష్టికి తెచ్చారు. దేశద్రోహం సెక్సన్‌ 124A చట్టాన్ని తొలగించాలంటూ వచ్చిన పిటీషన్లను కలిపి విచారిస్తామని పేర్కొన్నారు.

Related Articles