ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ప్రభుత్వం రివ్యూ పిటీషన్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. 2019 ఏప్రిల్ నుంచి ఎన్నికల బాండ్లను విక్రయిస్తున్నారు. ఈ బాండ్ల వివరాలతో పాటు విరాళాలు ఇచ్చన వ్యక్తులు, కంపెనీల పేర్లను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్‌బీఐకి సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసే అంశాన్ని వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని జాతీయ మీడియా రాస్తోంది. అవసరమైతే బాండ్లు కొనుగోలు చేసినవారి పేర్లను సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపే అవకాశముందని తెలుస్తోంది. వారి వివరాలను బహరింగ పర్చవద్దని కోర్టును కేంద్రం కోరవచ్చని భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలు మరికొన్ని వారాల్లో ఉన్నందున సుప్రీం కోర్టు తీర్పును రద్దు చేసేలా ఆర్డినెన్స్‌ను తెచ్చే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్న ఉన్నతాధికారులను పేర్కొంటూ ఎకనామిక్ టైమ్స్ పత్రిక రాసింది. బాండ్లు కొనుగోలు చేసినవారి పేర్లు బహిరంగ పర్చకుండా చేసేందుకు తమ వద్ద ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర అధికారులు తెలిపారు.
Related Articles
‘అమరరాజా’ వాదనలు వినండి
- February 21, 2023
అజహరుద్దీన్‌కు సుప్రీం షాక్
- February 14, 2023
EWS రిజర్వేషన్లు సబబే
- November 7, 2022
సెక్షన్ 66A: రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
- August 2, 2021