2021-22 విద్యా సంవత్సరానికి నీట్-PG కౌన్సిలింగ్‌ను ఇపుడున్న రిజర్వేషన్‌తో కొనసాగించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ మేరకు గత ఏడాది జులై 29వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుంది. దీని ప్రకారం EWS కోటాకు పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సరేనంది. అయితే ఇది ఈ ఏడాదికి మాత్రమే. నీట్ ఆల్ ఇండియా కోటా 27 శాతం రిజర్వేషన్‌కు కూడా సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. 2021-22 ఏడాదికి నీట్ EWS కోటాకు రూ.8 లక్షల ఆదాయ పరిమితికి సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. పాండే కమిటీ రికమెండేషన్స్‌కు కోర్టు అంగీకారం తెలిపింది. జులై 29న నీట్ ఆల్ ఇండియా కోటాలో EWS కోటాను సవాలు చేసిన పిటీషన్లను మార్చిలో విచారిస్తుంది.
Related Articles
‘అమరరాజా’ వాదనలు వినండి
- February 21, 2023
అజహరుద్దీన్‌కు సుప్రీం షాక్
- February 14, 2023
EWS రిజర్వేషన్లు సబబే
- November 7, 2022
సెక్షన్ 66A: రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
- August 2, 2021