EWS రిజర్వేషన్లు సబబే

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ముగ్గురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. EWS రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వేసిన పిటీషన్లను కొట్టివేశారు. చీఫ్‌ జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి జస్టిస్‌ పర్దివాలా ఈ రిజర్వేషన్లను సమర్థిస్తూనే… ఇది నిరంతర ఉండరాదని అభిప్రాయపడ్డారు. అంటే పరిమిత కాలానికి అమలు పర్చవచ్చని పేర్కొన్నారు. ఇలా అయిదు గురు సభ్యులుగల బెంచ్‌లో నలుగురు రిజర్వేషన్లను సమర్థించారు. జస్టిస్‌ రవీంద్ర భట్‌ మాత్రం రిజర్వేషన్లను వ్యతిరేంచారు. చీఫ్‌ జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ బాల ఎం. త్రివేది. జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి రిజర్వేషన్లను సమర్థించారు.

Related Articles