విజయవాడలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన టైలర్ మహమ్మద్ ఇనాయతుల్లా ఏకైక కుమారుడు మహమ్మద్ బాబ్జాన్. అతడికి రెండేళ్ల క్రితం వివాహంకాగా.. 11 నెలల బాబు ఉన్నాడు. బాబ్జాన్ విజయవాడ విజయ పాల ఫ్యాక్టరీలో కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సొంత అవసరాల కోసం లోన్ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. ఆ రుణం చెల్లించాలని నిత్యం లోన్ యాప్ నిర్వహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. బాబ్జాన్ తండ్రికి లోన్ యాప్ నుంచి ఫోన్ చేసి బెదిరించారు.. ఆయన కూడా అప్పు ఉంటే చెల్లిస్తామని చెప్పారు. అయినా వేధింపులు ఆగలేదు.. అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతూ మానసికంగా టార్చర్ చేశారు. మానస్తాపంతో బాబ్ జాన్ విజయవాడలోని తన రూమ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.