విజయవాడలో వైద్య విద్యార్ధి ఆత్మహత్య

విజయవాడలో ఖమ్మం జిల్లాకు చెందిన వైద్య విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండాకు చెందిన బానోతు నవీన్ కుమార్ విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్ కాలేజీలో మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 15న అతను విజయవాడలోని తన గదిలో పురుగుల మందు తాగగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న నవీన్ శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related Articles