విద్యార్థులకు రితేష్‌ దేశ్‌ముఖ్‌ మద్దతు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ మద్దతు తెలిపారు. ఒక్కరిది కావొచ్చు లేదా వేల మందిది కావొచ్చు… అందరి గొంతు (అందరి వాదనలు) వినడం వల్లనే మన దేశం గొప్ప దేశంగా మారిందన్నారు. హింసాత్మక చర్యలు పాల్పడేవారికి తన మద్దతు ఉండదని, పోలీసులంటే తాను గర్వంగా ఫీలయ్యేవాడినని… అయితే ఈసారి పరిస్థితి అంచనా వేయడంలో, పరిస్థితిని చక్కదిద్దడంలో వారు మరింత అభిమానంతో చేసి ఉంటే బాగుండేదన్నారు. ఇలాంటి దాడులు విద్యార్థులపై జరగాల్సింది కాదని రితేష్‌ ట్వీట్‌ చేశారు.

Related Articles