GHMC: డిసెంబర్‌ 1న పోలింగ్‌

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బుధవారం నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమ వుతాయన్నారు. నవంబర్ 20వ తేదీ నామినేషన్లకు చివరి రోజని, 21న పరిశీలన జరుగుతుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24 చివరి తేదీ కాగా,
డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని పార్థసారథి వెల్లడించారు. 4న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పార్ధసారథి వెల్లడించారు.

 

Related Articles