GHMC: మేయర్‌ పదవి మహిళకు

ఈసారి హైదరాబాద్‌ మేయర్‌ మహిళ(జనరల్‌ కేటగిరీ)కు రిజర్వ్‌ చేశారు. 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి చెప్పారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి ఓటర్ల జాబితాపై తుదినిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతోనే బ్యాలెట్‌ పద్ధతిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు రూ.5 లక్షలు కాగా, ఫలితాలు వచ్చాక 45 రోజుల్లో ఎన్నికల ఖర్చులు చూపాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,500, ఇతర అభ్యర్థులు రూ.5000ల చొప్పున డిపాజిట్‌ చెల్లించాలని, ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ వేసే సదుపాయం ఉందని పార్థసారధి తెలిపారు.

Related Articles