పన్నులు పెంచని ప్రభుత్వం మాది…

ఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో ఎలాంటి ప‌న్నులు పెంచ‌లేదు.. సామాన్యుడి న‌డ్డి విర‌చ‌లేదని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘హైద‌రాబాద్‌ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం. రెండు, మూడు రోజుల్లో ఆ వివ‌రాలు విడుద‌ల చేస్తాం. ప్రజ‌ల మీద ఒక పైసా కూడా భారం మోప‌లేదు. ఎలాంటి బిల్లులు పెంచ‌లేదు. రాష్ర్ట ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద‌ల‌కు సాయం చేశాం.. ప‌న్నులు పెంచ‌లేదు.. ఇబ్బంది పెట్ట‌లేదు. ప్రాప‌ర్టీ ట్యాక్స్, వాట‌ర్ బిల్లులు, ఎల‌క్ర్టిసిటీ బిల్లులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేష‌న్ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలు పెంచ‌లేద’ని కేటీఆర్ స్పష్టం చేశారు.
అందరి చూపు హైదరాబాద్‌ వైపే
పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ అయ‌స్కాంతం రాష్ర్టంలో ల‌క్షలాది ఉద్యోగాలు క‌ల్పించే దిశ‌గా ముందుకెళ్తున్నామ‌ని తెలిపారు. పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ అయ‌స్కాంతంగా మారింది. సుస్థిర ప్రభుత్వం వ‌ల్లే ఇది సాధ్యమ‌వుతుంది. టాస్క్ ద్వారా పిల్లల‌కు శిక్షణ ఇప్పించి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. అన్నపూర్ణ ద్వారా 50 వేల మందికి నాణ్యమైన భోజ‌నం అందిస్తున్నాం. ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. భార‌త‌దేశంలో ఇలాంటి ఇండ్ల‌ను ఏ రాష్ర్టం నిర్మించ‌లేదు. 9714 కోట్ల రూపాయాల‌తో ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌డుతున్నాం. ఇలాంటి న‌గ‌రంలో భార‌త్‌లో ఎక్కడైనా ఉన్నాదా? అని స‌వాల్ చేస్తున్నా. అతి త్వర‌లోనే నిరుపేద‌లుకు ఇండ్లు కేటాయిస్తాం. ల‌క్ష కుటుంబాల‌కు ప‌ట్టాలు ఇచ్చామ‌న్నారు. లాక్‌డౌన్‌లో నిరుపేద‌లుకు రూ. 1500 ఇచ్చి ఆదుకున్నాం. వ‌ల‌స‌కూలీల‌ను కూడా క‌డుపులో పెట్టుకున్నాం. వ‌ల‌స కూలీలు రాష్ర్ట అభివృద్ధిలో భాగ‌స్వామ్యం ఉంది అని సీఎం అన్నారని కేటీఆర్‌ చెప్పారు.
విష ప్రచారాలు చేశారు
టీఆర్‌ఎస్‌పై ఎన్నో రకాల విషప్రచారాలు చేశారని, తెలంగాణ వస్తే అంధకారం అవుతుందన్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందంటే కేసీఆర్‌ వల్లేనని కేటీఆర్‌ అన్నారు. పెట్టుబడులు రావని ప్రచారం చేశారని, ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ఎదుట ధర్నాలు జరిగేవని, శివారు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి లేదని, మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్‌ ముందుందన్నారు.

Related Articles