నేటి నుంచి నుమాయిష్..

నేటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే నుమాయిష్‌ కోసం జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్ శాఖల అనుమతులు తీసుకున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. హైకోర్టు మార్గదర్శనాలు అమలు చేస్తూ.. కొవిడ్ నేపథ్యంలో స్టాళ్ల సంఖ్యను సైతం 1600 కు కుదించారు. కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ భయాల నడుమ.. మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేసి నుమాయిష్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభా శంకర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మకశ్మీర్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల స్టాళ్లు నుమాయిష్‌లో దర్శనమివ్వనున్నాయి.

Related Articles