సీఎం కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ స్ధాపించక ముందు 1998లో ఆలయానికి వచ్చిన కేసీఆర్.. సీఎం హోదాలో తొలిసారిగా వస్తున్నారు. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపుదిద్దే క్రతువులో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు ప్రకటించారు. సుమారు రెండు గంటల పాటు కొండగట్టులో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
Related Articles
నేడు మీడియా ముందుకు కవిత
- March 9, 2023
TS: నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ
- March 9, 2023
తెలంగాణ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ..
- February 28, 2023
కొండగట్టు ఆలయంలో చోరీ.. దొంగలు ఎవరంటే?
- February 27, 2023
TS: నేడు వైద్య కళాశాలల బంద్
- February 27, 2023
నేడు హనుమకొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన
- February 27, 2023