ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకొన్నది. సివిక్ సెంటర్లో జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మొత్తం 266 ఓట్లు పోలవగా.. ఒబెరాయ్‌కు 150 ఓట్లు, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక అయినట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరిగింది. డిప్యూటీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి కమల్ బగ్రీపై 31 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్బాల్‌కు 147 ఓట్లు రాగా, బగ్రీకి 116 ఓట్లు వచ్చాయి. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఢిల్లీ మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నామినేటెడ్ సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం లేదని తేల్చిచెప్పడంతో తాజాగా ఎన్నిక జరిగింది.
Related Articles
నేడు మీడియా ముందుకు కవిత
- March 9, 2023
రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నా
- March 9, 2023
ఎంపీ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి
- February 20, 2023
మద్యం నిందితులకు నో బెయిల్
- February 17, 2023
నేడు భారత్, ఆసీస్ మధ్య రెండో టెస్టు
- February 17, 2023
ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ కానుక
- August 3, 2021