చర్చకు సిద్ధమా?

‘బీసీలను బానిసలుగా చేసుకోవాలని జగన్‌ రెడ్డి భావిస్తున్నాడు. టీడీపీ హయాంలో యాదవుల సంక్షేమానికి రూ.278 కోట్లు ఖర్చుచేశాం. వైసీపీ పాలనలో యాదవుల సంక్షేమానికి ఖర్చు చేసింది సున్నా. బీసీల సంక్షేమానికి ఎవరు ఎంత ఖర్చు చేశారో చర్చకు నేను సిద్ధం. వైసీపీ నేతలు సిద్ధమా..?’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సవాల్‌ విసిరారు. 25వ రోజైన గురువారం యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తిరుపతి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రేణిగుంటలో యాదవ సామాజికవర్గం, ఆర్‌ఎంపీలతో లోకేశ్‌ ముఖాముఖి మాట్లాడారు. ‘429 జీవోలో సవరణలు తీసుకొచ్చి అమలు చేస్తాం. ఆర్‌ఎంపీ బోర్డు ఏర్పాటుచేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని లోకేశ్‌ ఆర్‌ఎంపీలకు హామీ ఇచ్చారు. పాదయాత్ర గురువారం 15.5 కిలోమీటర్లు సాగి తిరుపతి నగరం శివారులో విడిది కేంద్రానికి చేరింది. లోకేశ్‌ ఇప్పటివరకు 344.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.

Related Articles