తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏఐసీసీ ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఢిల్లీలో ఈ విషయం వెల్లడించారు. ఎల్లుండి అంటే ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ప్రకటించారు. కేబినెట్‌తో పాటు ఇతర అంశాలను తరవాత ప్రకటిస్తామని వెల్లడించారు.