ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కొత్త బడ్జెట్‌లో రూ. 53,196 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో 2024-25 ఏడాదికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.రూ.2,75,891 కోట్లతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో రూ.2,01,178 కోట్లను రెవెన్యూ వ్యయం కింద రూ.29,669 కోట్ల మూలధన వ్యయం కింద ఖర్చు పెడతామని అన్నారను. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు మంత్రి వివరించారు. త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తామని, అలాగే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని మంత్రి చెప్పారు.
బడ్జెట్‌లో కీలక అంశాలు ఇవి..
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
వ్యవసాయానికి రూ.19,746 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
బీసీ సంక్షేమ శాఖకు రూ.8,000 కోట్లు
ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.13,313 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు