తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ అభిమానుల హర్షధ్యానాల మధ్య రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య , డిప్యూటీ సీఎం శివకుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో రేవంత్‌తో పాటు ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ తరవాత సీతక్క ప్రమాణ స్వీకార సమయంలో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ఎంతసేపటి జనం చప్పట్లు ఆగకపోవడంతో… ప్రమాణస్వీకారం చేయమని సీతక్కను గవర్నర్ కోరారు. ప్రమాణ స్వీకార సమయంలో సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం తరవాత సీతక్క, కొండా సురేఖలను సోనియా గాంధీ అలింగనం చేసుకుని, అభినందించారు. వేదికపై సోనియా, రాహుల్, ప్రియాంకలకు తన కుటుంబ సభ్యులను రేవంత్ పరిచయం చేశారు. ప్రమాణ స్వీకారం తరవాత కాంగ్రెస్ అగ్రనేతలు వెళ్ళిన తరవాత రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Related Articles
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
- February 10, 2024
రేపటి నుంచి ప్రజాదర్బార్..
- December 7, 2023
రేవంత్ రాజకీయ ప్రస్థానం
- December 5, 2023
రేవంత్ రెడ్డి ట్రెండింగ్
- December 5, 2023
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- December 5, 2023
తెలంగాణ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ..
- February 28, 2023
TS: నేడు వైద్య కళాశాలల బంద్
- February 27, 2023