‘అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని తేలిపోయింది. గూగుల్ టేకౌట్ వంటి టెక్నాలజీ వస్తుందని, తాను ఇరుక్కుంటానని జగన్ అనుకుని ఉండరు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోడి కత్తి కమల్‌హాసన్ ఎన్ని డ్రామాలాడాడు? సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఊహించలేమని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. వందల వాహనాలు, 3 వేల మంది కార్యకర్తలతో గుంటూరులో కన్నా నివాసం నుంచి మార్కెట్, నగరపాలక సంస్థ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్, ఆటోనగర్ మీదుగా బైపాస్ నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి కన్నాను, ఆయన అనుచరులను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘కోర్టులో సీబీఐ వేసిన అఫిడవిట్ ప్రకారం.. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వ్యక్తులు ఆ రోజు రాత్రి కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. చంపిన తర్వాత తిరిగి అక్కడకే వెళ్లారు. అక్కడి నుంచి లోట్‌సపాండ్‌లో ఉన్న జగన్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ వెంటనే వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం మొదలుపెట్టారు. టెక్నాలజీ శక్తి వారికి తెలియదు. గూగుల్ టేకౌట్ ఎవరెవరు ఎటు నుంచి ఎటు వెళ్లారో.. ఎవరెవరికి ఫోన్లు చేశారో మొత్తం బయటపెట్టింది. వివేకాది ముందు గుండెపోటని ప్రచారం చేశారు. హత్య అని బయటపడేసరికి నేనే చేయించానని ఆరోపణలు చేశారు. ఇవన్నీ నమ్మి ప్రజలు ఒక నరహంతకుడికి రాష్ట్రాన్ని అప్పగించారు. ఇటువంటి వ్యవహారాలు ఇదే మొదటిసారి కాదు. కొంతకాలం క్రితం సహకార ఎన్నికల్లో పులివెందులలో అప్పుడు టీడీపీలో ఉన్న సతీశ్‌రెడ్డి అనే నేతపై దాడి జరిగింది. దాడిచేసిన వారిని అడ్డుకోవడానికి గన్‌మెన్ కాల్పులు జరిపాడు. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి బతికే ఉన్నాడని చూపించి మేజిస్ట్రేట్ ముందు తప్పుడు మరణ వాంగ్మూలం నమోదు చేయించారు. ఆ మేజిస్ట్రేట్‌కు హైదరాబాద్‌లో విలువైన ఆస్తి ఇచ్చారు. తర్వాత ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. ఆ మేజిస్ట్రేట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. వీళ్లు దేనికైనా సమర్థులు.. ఏదైనా చేయగలరు. వివేకా హత్య కేసులో ఎవరినీ జగన్‌రెడ్డి కాపాడలేరు’ అని చంద్రబాబు అన్నారు.
Related Articles
ఇది కేవలం జగన్ కక్ష సాధింపే
- February 29, 2024
వివేకా హత్య కేసుపై యనమల సంచలన వ్యాఖ్యలు
- February 25, 2023
వివేకాను చంపింది వాళ్లే..
- February 23, 2023
పట్టాభిని కిడ్నాప్ చేశారు..
- February 21, 2023
చంద్రబాబు, విజయసాయి ఫోటోపై బండ్ల గణేష్ ట్వీట్
- February 20, 2023
నేనేం పాకిస్థాన్ నుంచి వచ్చానా..
- February 18, 2023
వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్
- February 17, 2023