సోషల్ మీడియా సెన్సేషన్ మహాసేన రాజేష్ ఇవాళ టీడీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఇవాళ చంద్రబాబు ప్రత్యేకంగా ఎస్సీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన సమక్షంలో రాజేష్ టీడీపీలో చేరారు. పార్టీ కండువ కప్పి… ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ… 2019 ఎలక్షన్లకు ముందు చంద్రబాబును దళిత ద్రోహిగా సీఎం జగన్ చిత్రీకరించారని అన్నారు. జగన్ మాటలు విని చంద్రబాబును జనం అపార్థం చేసుకున్నారని రాజేశ్ తెలిపారు. నిజమైన దళిత ద్రోహి ఎవరో త్వరగానే గ్రహించామని రాజేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తూ రాజేష్ పాపులర్ అయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోటలో దళిత సామాజికవర్గంతో చంద్రబాబుగారు నిర్వహించిన సమావేశంలో మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుందని, దళిత ద్రోహి జగన్ తుగ్లక్ పాలన చూసాకే చంద్రబాబుగారి పాలన రామరాజ్య పాలన అని అర్థమైందని రాజేష్ అన్నారు pic.twitter.com/4ygCbOUAUK
— Telugu Desam Party (@JaiTDP) February 17, 2023