జగన్‌ కోరారు… జెరూసలేం సాయం పెంచారు

 

(అమరావతి నుంచి కె స్రవంతి చంద్ర)

దేవాలయాల్లో అన్యమత ప్రచారం, ఇంగ్లీష్ మీడియం ద్వారా మత ప్రచారం సాగుతుందనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం మతపరమైన మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జెరూసలేం, ఇతర క్రిస్టియన్‌ తీర్థయాత్రలకు వెళ్ళే యాత్రికులకు ఇచ్చే ఆర్ధికసాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలా తీర్థయాత్రలకు వెళ్ళే యాత్రికుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉంటే సాయాన్ని రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంచాలని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మొహమ్మద్‌ ఇలియాస్‌ రిజ్వి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కన్నా ఎక్కువ ఉంటే వారికి ఇచ్చే ఆర్ధిక సాయం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచినట్లు ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. క్రిస్టియన్‌ యాత్రికులకు ఆర్థిక సాయం పెంచాలన్న ప్రతిపాదన నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నుంచే వచ్చింది, క్రిస్టియన్‌ యాత్రికులకు ఆర్థిక సాయం పెంచాలని ముఖ్యమంత్రి కోరుతున్నారని ఆయన కార్యదర్శి నుంచి ఈ ఏడాది జులై 10వ తేదీన సీఎంఓ ఆఫీసుకు లేఖ అందింది. ఆ తరవాత ఆగస్టు 29వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మైనారిటీ వెల్ఫేర్‌ విభాగం సమీక్ష సమావేశంలో ఆర్థిక సాయం పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ స్టేట్‌ క్రిస్టియన్‌ (మైనారిటీస్‌) ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నుంచి ఆర్థిక సాయం పెంచాలని కోరుతూ అక్టోబర్‌ 23వ తేదీన ప్రభుత్వానికి లేఖ అందింది. దీంతో ఆర్థిక సాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

(

Related Articles