రాష్ట్రాల సరిహద్దులు ఓపెన్‌

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే వారికి ఇక అడ్డంకులు లేవు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకున్నా… ఏపీ ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఉండేవి. ఇపుడు ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు ఏపీ ప్రకటించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలను అనుమతించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మూడు నెలల తరువాత ఎటువంటి అనుమతులు లేకుండా రాష్ట్ర సరిహద్దులు తెరుచుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులతో రాకపోకలు జోరందుకోనున్నాయి. మరి అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా ప్రారంభమమౌతాయా అన్నది చూడాలి.

Related Articles