జీహెచ్‌ఎంసీ ఎన్నికలు… టీఆర్‌ఎస్‌ హామీలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక హామీలు ఇచ్చారు.ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు అనేక వరాలు ప్రకటించారు. సినిమా పరిశ్రమకు కూడా రాయితీలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

వాటిలో ప్రధానమైనవి…

  • వచ్చే నెల నుంచి 20వేల లీటర్ల వరకు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు.
  •  97 శాతం మందికి ఉచితంగా నీరు
  • ప్రాంతీయ బాహ్యవలయ రహదారి ( రీజినల్‌ రింగ్‌రోడ్డు) నిర్మాణం
  • ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌ల నిర్మాణం
  • నగరం చుట్టూ మరో 3 టిమ్స్‌ ఆస్పత్రులు
  • బస్తీ దావాఖానాల్లో డయాగ్నస్టిక్‌ సేవలు
  • విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలు
  • రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో
  • బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహదీపట్నం వరకు మెట్రో
  • నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలు
  • కేశవాపురం జలాశయ నిర్మాణ పనులు ప్రారంభం
  • రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి
  • రూ.12 వేల కోట్ల అంచనాతో సమగ్ర వరదనీటి నిర్వహణ ప్రణాళిక
  • లాండ్రీలు, దోబీ ఘాట్‌లకు ఉచిత విద్యుత్‌
  • కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు
  • పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్‌ ఛార్జీల నుంచి మినహాయింపు
  • రూ.10కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌
  • మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక తరహాలో టికెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు

Related Articles