అజహరుద్దీన్‌కు సుప్రీం షాక్‌

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అజహర్‌ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇక నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అలాగే సాధ్యమైనంత త్వరగా హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచించింది.

Related Articles