ఆసీస్‌ 263 ఆలౌట్‌

ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆసీస్‌.. శుక్రవారం ఢిల్లీ వేదికగా ప్రారంభమైన మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖవాజా (125 బంతుల్లో 81; 12 ఫోర్లు, ఒక సిక్సర్‌), పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (142 బంతుల్లో 72 నాటౌట్‌; 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించగా.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడుతూ విలువైన పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమీ 4 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (13), కేఎల్‌ రాహుల్‌ (4) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమ్‌ఇండియా.. ప్రత్యర్థి స్కోరుకు 242 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు వందో టెస్టు ఆడుతున్న చతేశ్వర్‌ పుజారాకు దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ జ్ఞాపిక అందజేశాడు.

Related Articles