నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనమడు, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెల 27న ఏపీలోని కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి గుండె, మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. తారకరత్న మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Related Articles
కాసేపట్లో ఫిల్మ్చాంబర్కు తారకరత్న పార్థివదేహం
- February 20, 2023
నేడు తారకరత్న అంత్యక్రియలు
- February 20, 2023
తారకరత్న మృతిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
- February 20, 2023
తారకరత్న మృతిపై ప్రధాని మోడీ సంతాపం
- February 19, 2023
హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతికకాయం
- February 19, 2023
అద్భుత క్షేత్రంగా కొండగట్టు
- February 16, 2023
నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్
- February 15, 2023