ఎల్‌ రమణ రాజీనామా

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎల్‌ రమణ రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.

Related Articles