తెలంగాణ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ..

తెలంగాణ బీజేపీ నేతలంతా ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు హస్తినకు పయనమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సహా ముఖ్య నేతలు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయా నేతలతో కేంద్ర హోంమంత్రి అమిషా ఇవాళ భేటీ కానున్నారు. త్వరలో ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన బీజేపీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా.. ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరిట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు పిలుపునిచ్చింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు ఇవాళ చివరి రోజు కాగా.. ప్రతి నియోజకవర్గంలో మీటింగ్‌లతో పాటు బహిరంగ సభలు నిర్వహించాల్సి ఉంది. ఆ సభల్లో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని తెలంగాణ బీజేపీ ఇంతకు ముందే ప్రకటించింది. కానీ ఆ కార్యక్రమంతో సంబంధం లేకుండా రాష్ట్ర ముఖ్య నేతలను ఢిల్లీకి రమ్మనటం పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

Related Articles