‘ఇందిరమ్మ పథకాలు రావాలంటే బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ పాలన రావాలి.. ప్రజలను వంచనకు గురిచేస్తున్న బీఆర్ఎస్ పాలనను మరో పదిమాసాల్లో పాతరేయం ఖాయం.. ఆ తర్వాత వచ్చే కాంగ్రెస్ పాలనలోనే పూర్వ వైభవం వస్తుంది..’ అని టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. హాత్‌సే హాత్ జోడో పాదయాత్ర గురువారం ఐనవోలు మండలంలో కొనసాగింది. బుధవారం రాత్రి ఐనవోలుకు చేరుకున్న రేవంత్‌రెడ్డి.. గురువారం ఉదయం మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఐనవోలు మల్లికార్జునస్వామ ఆలయం నుంచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమై తెలంగాణ తల్లి సెంటర్ ద్వారా అంబేద్కర్ సెంటర్ గుండా మహరాజుల కాలనీ, పెరుమాండ్లగూడెం, పంథిని మీదుగా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వరకు కొనసాగింది. తొలుత ఐనవోలులో గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ 1వ వార్డు సభ్యురాలు టి.లలిత ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా.. అంటూ అడిగారు. కాంగ్రెస్ పాలనలోనే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని, ఇంత వరకు ఎవ్వరికీ డబుల్బెడ్రూమ్ ఇళ్లు రాలేదని వాపోయింది. పెరుమాండ్లగూడెంలో మహిళలు మంగళహారతులు, బోనాలతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి స్వాగ తం పలికారు. ఆనంతరం గ్రామస్థులతో మమేకమయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతోందా.. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చా యా.. అంటూ ఆయన ప్రశ్నించగా మహిళలు లేదు లేదంటూ తీవ్రంగా విమర్శించారు.
Related Articles
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
- February 10, 2024
రేపటి నుంచి ప్రజాదర్బార్..
- December 7, 2023
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం
- December 7, 2023
రేవంత్ రాజకీయ ప్రస్థానం
- December 5, 2023
రేవంత్ రెడ్డి ట్రెండింగ్
- December 5, 2023
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- December 5, 2023
లోకేష్ పాదయాత్రలో ఊహించని సీన్
- February 27, 2023